తాడిపత్రి: యాడికిలో అనధికారికంగా వైద్యం చేస్తున్న ఆర్ఎంపి క్లినిక్‌లను మూసివేసిన డీఎంహెచ్‌వో ఈబీదేవి, రోగులకు వైద్యం చేస్తే చర్యలు
యాడికిలో శంకరయ్య అనే వ్యక్తి అనధికారికంగా నడుపుతున్న ఆర్ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేశామని డీఎంహెచ్ ఈబీ దేవి బుధవారం చెప్పారు. శంకరయ్యకు కనీసం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కూడా లేదన్నారు. కొందరు రోగులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్లినిక్‌లో పరిశీలించామన్నారు. ఎలాంటి ఆథరైజేషన్ సర్టిఫికెట్ లేదన్నారు. వైద్యం కొనసాగిస్తే శంకరయ్య పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు.