కొండపి: సింగరాయకొండ పాకాల సముద్ర తీరంలో అలల ఉధృతి, తుఫాను కారణంగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న అధికారులు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరం ప్రాంతంలో అలల ఉధృతి అధికంగా కనిపించింది. సోమవారం దీపావళి పండుగ కావడంతో పర్యటకులు కూడా అంతంతమాత్రంగానే సముద్ర తీరానికి వచ్చారు. అలల ఉధృతి అధికంగా ఉండడంతో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తతో వ్యవహరిస్తున్న అధికారులు మెరైన్ పోలీసులను కాపలాగా ఉంచారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.