తుఫాను సమయంలో గ్రామస్థాయి నుంచి అధికారులు కష్టపడ్డారని ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సింగరాయకొండలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాను సమయంలో అధికార యంత్రాంగం మరియు గ్రామస్థాయి నుంచి కష్టపడిందని కితాబులు ఇచ్చారు. అనుభవమున్న నాయకత్వంతోనే మనకు పెద్ద గండం గడిచిందని తుఫాను సందర్భంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి స్వామి పేర్కొన్నారు.