మారెం రెడ్డిగారి పల్లి ప్రభుత్వ పాఠశాల స్థలం దురాక్రమణ పై తహసీల్దార్ కు మాలమహానాడు ఐక్యవేదిక ఫిర్యాదు
పీలేరు మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ మారంరెడ్డి గారి పల్లి ప్రభుత్వ పాఠశాల స్థలం సర్వేనెంబర్ 76 /1లో 5 సెంట్లు భూమిని దురాక్రమణ చేసి ఆవుల షెడ్లు నిర్మించారని మాల మహానాడు ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం నారాయణ సోమవారం తహసిల్దార్ శివ కుమార్ కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా గుర్రంనారాయణ మాట్లాడుతూ ఎర్రగుంటపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ భర్త ధర్మరాజు ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని పూర్తిగా దురాక్రమణ చేసి ఆవుల షెడ్డు నిర్మించినట్లు పేర్కొన్నారు.