హిమాయత్ నగర్: ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టిస్తామన్న కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక ఇటుక కూడా పెట్టలేదు : మాజీ మంత్రి కేటీఆర్
అల్లాపూర్ లో హైడ్రా బాధితులతో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం సాయంత్రం దీపావళి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక ఇటుక కూడా పెట్టలేదని మండిపడ్డారు. రెండు సంవత్సరాలలో పేదల బతుకు ఆగమైపోయాయని రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయిందని ఆటో వాళ్ళ నష్టపోయాడని తెలిపారు. నరకాసుడు వంటి ప్రభుత్వం కొట్టుకుపోతుందని ఎక్కువ కాలం పట్టదని మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుందని అన్నారు.