అరుదైన గౌరవం దక్కించుకున్న బల్లి కిరణ్ కుమార్
- నాయుడుపేటలో ఘనంగా సత్కరించిన రోటరీ క్లబ్ సభ్యులు
తిరుపతి జిల్లా నాయుడుపేట 108 అంబులెన్స్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తూ ప్రతిభ, సామాజిక సేవ వంటి విభాగాలలో విశిష్ట సేవలు అందించి హర్యానా రాష్ట్రానికి చెందిన ఎం.బి.ఆర్ యూనివర్సిటీ (2025 సంవత్సరానికి గాను) ద్వారా ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ అవార్డు అందుకున్న బల్లి కిరణ్ కుమార్ కు ఘన సన్మానం జరిగింది. సోమవారం నాయుడుపేట రోటరీ క్లబ్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్యానా ఎం బి ఆర్ యూనివర్సిటీ డాక్టరేట్ పొందిన బల్లి కిరణ్ కుమార్ కు నాయుడుపేట రోటరీ క్లబ్ గౌరవ అధ్యక్షులు పెసల జయరాజ గోపాల్, అధ్యక్షులు ఆదవరం నాగురయ్య, సెక్రటరీ సుబ