ప్రజా సమస్యలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించండి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Sep 22, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో 220 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు