ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో బీసీల హక్కుల కోసం ప్రభుత్వాలు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాజకీయ పార్టీల మోసాలకు నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి మృతి పట్ల ఓ బి సి విద్యార్థి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరాములు ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. బీసీల హక్కుల సాధన కోసం గ్రామ గ్రామాన పోరాడే బీసీలకు హక్కులను సాధించుకుంటామన్నారు.