అసిఫాబాద్: విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరు కావాలని: ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
విద్యార్థుల సంక్షేమం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరు కావాలని ఐటీడీఏ పీవో అధికారి ఖష్బూ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ వసతి గృహాలలో పార్ట్ టైం/ దినసరి వేతనంతో పని చేస్తున్న 220 మంది సమ్మెలో పాల్గొన్న నేపథ్యంలో వారి 3 నెలల వేతనాన్ని వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. దసరా సెలవుల అనంతరం ఈ నెల 4వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం అయినందున సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులకు వంట, పరిశుభ్రత, విద్యార్థుల సంక్షేమ దృష్ట్యా తాత్కాలికంగా బయట వ్యక్తులు పని చేయడం జరుగుతుందని తెలిపారు.