కేతేపల్లి: మూసికి పోటెత్తిన వరద ప్రభావం 6 గేట్లు ఎత్తిన అధికారులు
నల్గొండ జిల్లా: హైదరాబాద్ చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసి ప్రాజెక్టులోకి వర్గ ప్రవాహం పెరిగింది. ఈ సందర్భంగా మూసి ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టులోకి 8368.84 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 8368.64 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేశారు .ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాక ప్రస్తుతం 643.87 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో 4.16 టీఎంసీల నీటి నిల్వ ఉంది.