నెల్లూరు నగరంలోని అపోలో సెంటర్ సమీపంలో ఉన్న గుంతల్లో భారీ లారీ ఇరుక్కున్నది. ఇటీవల కార్పొరేషన్ అధికారులు గోతులు తీశారు. దీంతో రోడ్డు మీద పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఓ లారీ అటువైపు వెళుతూ దాని టైర్ గుంటలో ఇరుక్కుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన రాత్రి 9 గంటల సమయంలో జరిగింది.