జాతీయ భాష హిందీ అభివృద్ధికి అందరూ సహకరించాలి
: సామాజిక వేత్త ఆకుల శ్రీనివాసరావు
పార్వతీపురం లైన్స్ కళ్యాణ మండపంలో ఆదివారం హిందీ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజికవేత్త ఆకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ భాష హిందీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. హిందీ ప్రసార సభ పరీక్షలు ఆదివారంతో ముగిసినట్లు మండల విద్యాశాఖ అధికారి ఎన్. స త్యనారాయణ తెలిపారు.