పలమనేరు: అక్రమంగా ఇసుక తవ్వేయడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్లు నేలకోలుతున్నాయని ప్రజలు ఆవేదన
పలమనేరు: మండలం స్థానికులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. నియోజకవర్గంలో అక్రమార్కుల ఇసుక దాహానికి దశాబ్దాల వయస్సు కలిగిన చెట్లు నేల కూలుతున్నాయి. కేటిల్ ఫార్మ్ బ్రిడ్జి సమీపంలో అటవీశాఖ నగరవనం అనుకుని కౌండిన్య నదిలో ఇసుక కోసం జేసీబీలతో తవ్వేశారు. దీంతో నగరవనం అనుకుని ఉన్న భారీ చింతచెట్టు ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురై నేలకూలాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చెట్లు నేల కూలుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఇకనైనా సంబంధించిన అధికారులు పట్టించుకోని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని కట్టడి చేయవలసిందిగా కోరుతున్నారు.