సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతి
సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీమంత్రి సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన రాం రెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మృతి చెందడంతో సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం లో విషాదఛాయలు అలుముకున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో దామోదర్ రెడ్డి ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు .ఆయన అంత్యక్రియలు ఈ నెల 4న తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.