రాయదుర్గం: కణేకల్లులో యూరియా కోసం తెల్లవారుజాము నుండే బారులు తీరిన రైతులు
కణేకల్లు మండల కేంద్రంలో యూరియా కోసం అన్నదాతలు భారీ క్యూ కట్టారు. సోమవారం తెల్లవారుజాము నుండే వివిధ గ్రామాల నుంచి వచ్చిన వందలాది మంది రైతులు ఆదర్శ సహకార సొసైటీ వద్ద బారులు తీరారు. వ్యవసాయ శాఖ అధికారులు నేడు మండలంలోని పలు రైతు సేవా కేంద్రాలు, సొసైటీలలో యూరియా సరఫరా చేస్తుండటంతో రైతుల ఆ యూరియా దక్కించుకునేందుకు రావడంతో ఆ ప్రాంతం జనసంద్రంలా మారింది. రెండు సంచుల గంటల కొలదీ లైన్ లో వేచి ఉన్నారు. తమకు దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మరీ పంపిణీ చేస్తుప్పటటికీ రైతులు యూరియా కోసం ఎగబడటం కనిపించింది.