మంత్రాలయం: కార్మిక చట్టాలకు తూట్లు పొడిచి నేడు కన్నీరు తుడిచే ప్రయత్నంలో సన్మానాలు చేయడం ఎంతవరకు సమంజసం: సీఐటీయూ మండల కార్యదర్శి
మంత్రాలయం:కార్మిక చట్టాలకు తూట్లు పొడిచి నేడు కన్నీరు తుడిచే ప్రయత్నంలో సన్మానాలు చేయడం ఎంతవరకు సమంజసం అని మంత్రాలయం సీఐటీయూ మండల కార్యదర్శి జయరాజ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గురువారం మంత్రాలయం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఎంపీడీవో నూర్జహాన్ కార్మికులను సన్మానించారు. శ్రమ దోపిడీకి పాల్పడుతున్న వారికి సత్కరించే హక్కు లేదని విమర్శించారు. పనికి తగ్గ వేతనం కల్పించాలని కోరారు.