తంబళ్లపల్లెలో రెండు బైకులు ఢీ ఇద్దరు గాయపడ్డారు
తంబళ్లపల్లె లో రెండు బైకులు సోమవారం ఎదురుదురుగా ఢీకొని ఇద్దరు యువకులు గాయపడ్డారు. హరీశ్ కుమార్ సిద్దారెడ్డిగారి పల్లెకు వెళ్తుండగా వినయ్ కుమార్ ATM వద్దకు వస్తుండగా చిరుజల్లుల కారణంగా వాహనాలు అదుపు తప్పి ఢీకొన్నాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. హరీశ్ కుమార్ మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించబడ్డాడు. పోలీసులు సంఘటన పై విచారణ చేస్తున్నారు