కాంపౌండ్ నిర్మాణానికి ఎంపీ బి.కె పార్థసారథి హామీ
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మున్సిపాలిటీలోని కోనాపురం వాసులు మంగళవారం మధ్యాహ్నం ఎంపీ బీకే పార్థసారథిని కలిశారు. సప్పలమ్మ దేవస్థానానికి ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ వినతి చేశారు. స్పందించిన ఎంపీ నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.