జమ్మలమడుగు: జమ్మలమడుగు : భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆది
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి ఆదివారం భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నట్లు నాయకులు తెలిపారు. నేడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప నగరం లో డా.జానమద్ది హనుమచ్చాస్త్రి బ్రౌన్ శాస్త్రీ శత-జయంతి సందర్భంగా జానమద్ది స్మారక సాహిత్య మరియు గ్రంధాలయ సేవ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాల్లో బాగంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన భారత పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు