ప్రొద్దుటూరు: పట్టణ ఆరోగ్య సిబ్బందితో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి సమావేశం
Proddatur, YSR | Sep 15, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణ ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్లు, సచివాలయాల పరిధిలోని ఏఎన్ఎం సిబ్బందితో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశించిన మేరకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రజలందరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలన్నారు.