అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధించిన మీడియా ఆంక్షాలను ఎత్తివేయాలి:KVPS జిల్లా కార్యదర్శి దినకర్
ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మీడియాకు అనుమతి నిబంధనలు పెట్టడం సరైన పద్దతి కాదని KVPS జిల్లా కార్యదర్శి దినకర్ మండి పడ్డారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు బయటికి రాకుండా ఉండేందుకే మీడియాకు ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఆసుపత్రిలో విధించిన మీడియా ఆంక్షాలను తొలగించాలని డిమాండ్ చేశారు.