నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెలో మంగళవారం రాత్రి నాలుగు పొట్టేళ్లు చోరీకి గురైనట్లు సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. గ్రామానికి చెందిన వెంకట కృష్ణారెడ్డి అబ్దుల్లాపురం రహదారిలో రేకుల షెడ్డు నిర్మించి, 18 పొట్టేళ్లు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నారు. వాటిలో 4 పొట్టేళ్లను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారని, వీటి విలువ రూ.60,000 ఉంటుందని బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.