జిఎస్టి తగ్గింపుతో పేదవారి జీవితాల్లో వెలుగు: బనగానపల్లె బిజెపి నాయకులు యాదగిరి,హరికృష్ణ, శివకృష్ణ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 తగ్గింపు నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఉపశమనం కలిగిస్తుందని బిజెపి బనగానపల్లె టౌన్ అధ్యక్షులు యాదగిరి, రూరల్ అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, మండల ఇన్చార్జ్ శరత్ చంద్ర కుమార్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శివకృష్ణ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలు, పనీర్, రొటీ, పిజ్జా బ్రెడ్, పుస్తకాలు, పెన్సిల్స్, మందులు, ట్రాక్టర్లు, టీవీలు, ఫ్రిజ్లు వరకు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా జీఎస్టీని తగ్గించడం ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టికి నిదర్శనమని ఆయన అన్నారు.