మంత్రాలయం: ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈరన్న దేవస్థానం లో స్వామివారి రెండు నెలల హుండీని ఆదాయం లెక్కింపు
కౌతాళం : మండల పరిధిలోని ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం రెండు నెలల హుండీని శుక్రవారం 1,37,79,215 నగదు, 6 గ్రాములు 750 మిల్లీగ్రాముల బంగారం, 18 కిలోలు 990 గ్రాముల వెండి వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ కె.వాణి తెలిపారు. లెక్కింపులో హుండీ పర్యవేక్షణ అధికారిగా ఆదోని గ్రేడ్-1 కార్యనిర్వాహణాధికారి పీసీ రాంప్రసాద్, బ్యాంకు అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.