అసిఫాబాద్: ఆసిఫాబాద్ పెద్దవాగులో చిక్కుకున్న ఇసుక ట్రాక్టర్ : ప్రాణాలతో బయటపడిన డ్రైవర్
పెద్దవాగులో వరద అంతగా లేదు కదా అనుకుని ఇసుక కోసం వెళ్లారు. కూలీలతో కలిసి పనులు మొదలు పెట్టారు. కానీ ఉన్నట్లుండి పెద్దవాగు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ వరలు మొదలయ్యాయి. వరద ఉధృతి పెరుగుతోంది..ట్రాక్టర్లను బయటకు తీద్దాం అనుకునేలోపే భారీ వరద చుట్టుముట్టింది. ట్రాక్టర్లు పోయినా సరే..ప్రాణాలు కాపాడుకుందాం అనుకుని బయటకు పరుగెత్తారు డ్రైవర్లు,కూలీలు. ఇది ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దవాగులో బుధవారం సాయంత్రం జరిగిన సంఘటన..దీన్ని బట్టి ఏ స్థాయిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారో అర్థమవుతోంది.