ఇబ్రహీంపట్నంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బందును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు గురువారం మధ్యాహ్నం మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల కారణంగా విద్యా వ్యవస్థ అంధకారంలోకి నెట్టబడుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.