శ్రీకాళహస్తిలో గ్రంథాలయ వారోత్సవాలు శ్రీకాళహస్తిలోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంఈఓ బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులచే గ్రంథాలయపఠన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ చేపట్టారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, ఉపయోగించుకుని ఉన్నత విజ్ఞానవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.