పత్తికొండ: పత్తికొండలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా టెంకాయలకు భారీ డిమాండ్
పత్తికొండ లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముందుగా వచ్చే పెత్తర్ల అమావాస్య ఆదివారం రావడంతో భక్తులు శివాలయాల్లో, ఈరన్న స్వామి క్షేత్రాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టెంకాయల వ్యాపారం జోరందుకుంది. ఒక్కో ధర రూ.40కి విక్రయిస్తున్నట్లు వ్యాపారులు బుధవారం తెలిపారు. ఇప్పటికే రెండు లారీల టెంకాయలు తమిళనాడు రాష్ట్రం గుడియాట్టం నుంచి పత్తికొండకు దిగుమతి అయ్యాయి.