ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడి గ్రామాల మధ్య అట్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొండపి అనకర్లపూడి గ్రామాల మధ్య అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు దాటేందుకు ప్రజలు ఎవరు ప్రయత్నించవద్దని స్థానిక అధికారులు వాహనదారులను ప్రజలను హెచ్చరిస్తున్నారు.