బనగానపల్లె: అవుకులో ఓ వ్యక్తి ఆత్మహత్య
నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. అవుకు గ్రామంలోని కోటవీధికి చెందిన గుర్రాల రామస్వామి (46) గురువారం రాత్రి భార్యతో గొడవపడ్డారు. ఉదయం భార్య వ్యవసాయ పనులకు వెళ్లగా జీవితంపై విరక్తి చెందిన రామస్వామి ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్య కు యత్నించాడు. స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.