రాయచోటి: దిత్వా తుఫాను నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి రాంప్రసాద్ రెడ్డీ
పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజల సమస్యలు,అభ్యర్థనలు, వినతులు స్వయంగా విని తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం తమ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి గారిని పలువురు కలిసి తమ సమస్యలను వివరించగా, వాటిని పరిష్కరించేందుకు మంత్రి హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా పలువురు అధికారులు నాయకులు దుశాలవ, పుష్పగుచ్చమ్మలతో మంత్రి గారిని ఘనంగా సన్మానించారు.