జిందాల్ నిర్వాసితుల సమస్యలపై సీఎం కు నూతన కలెక్టర్ నివేదిక సమర్పించాలి: బౌడరాలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జగన్
Vizianagaram Urban, Vizianagaram | Sep 15, 2025
జిందాల్ నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కి నూతన కలెక్టర్ తక్షణమే నివేదిక సమర్పించాలని సోమారం మధ్యాహ్నం ఎస్ కోట మండలం బౌడారా లో ఏపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ డిమాండ్ చేశారు. 18 సంవత్సరాల క్రితం తీసుకున్న భూములు ఎటువంటి పరిశ్రమలు పెట్టని వారు చాలా పరిశ్రమలు పెట్టేస్తాం ఉపాధి కల్పిస్తామని చెపుతున్న మాటలు కుట్ర పూరిత మేనన్నారు. పేదల భూములు పేదలకు తిరిగి అప్పగించే వరకు నిరంతరంగా దీర్ఘకాలిక పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.