మేడ్చల్: జవహర్ నగర్ లో రోడ్డు సమస్యపై బిజెపి నిరసన ర్యాలీ
జవహర్ నగర పచ్చిమ శాఖ బిజెపి ఆధ్వర్యంలో ఫైరింగ్ రేంజ్ కామన్ నుంచి ఆర్మీ హనుమాన్ ఆలయం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు అభివృద్ధి సమస్యపై బిజెపి నాయకులు ప్రజల పక్షాన నిలబడి తక్షణ చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.