రాయదుర్గం: వేపులపర్తి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు
గుమ్మగట్ట మండలంలోని వేపులపర్తి క్రాస్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం రాత్రి రాయదుర్గం వైపు నుండి వేపులపర్తి గ్రామానికి బైక్ పై వెళుతున్న వినయ్, జగదీష్ అనే ఆ ఇద్దరు యువకులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని స్థానికులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు.