అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం, విఆర్ పురం మండలాల నుంచి పాపికొండలు విహారయాత్ర నిలిచిపోయి ఇప్పటికి మూడు వారాలయింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. గోదావరి నదిలో వరదల కారణంగా మూడు వారాల నుంచి పర్యాటక బోట్లు నిలిచిపోయాయని చెప్పారు. ప్రస్తుతం గోదావరి నదిలో నీటిమట్టం తగ్గడంతో పాపికొండలు వ్యవహారయాత్రకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎప్పటికీ బోట్లు తిరిగేందుకు అనుమతులు రాలేదని తెలిపారు.