కోడుమూరు: కోడుమూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని సిపిఎం ధర్నా
కోడుమూరు మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని మంగళవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు గఫూర్ మియా, రాజు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో జీపు జాత నిర్వహించి సమస్యలు పరిశీలించడం జరిగిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలయ్యారని తెలిపారు. ఉల్లి, పత్తి రైతుల కష్టాలు తెలిసిందేనన్నారు. చాలా చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు.