వనపర్తి: తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ పండగ : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ ప్రాంగణంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లోని ప్రత్యేక పూజలు పాల్గొన్న వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు తొమ్మిది రోజులపాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలు తీరక పూలను సేకరించి ఒక్కొక్క పువ్వుతో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని అన్నారు అనంతరం ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసే విధంగా ప్రణాళిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.