నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు సమీపంలోని వీరభద్రస్వామి గుడి వద్ద పేకాట ఆడుతున్న పదిమంది పేకాట రాయుళ్లు అరెస్ట్ చేసినట్లు సీఐ మద్దినేని రమేష్ బాబు సోమవారం తెలిపారు, విశ్వసనీయ సమాచార మేరకు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు, వారి వద్ద నుంచి పీక ముక్కలు 8200 నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని సీఐ మద్దినేని రమేష్ బాబు వెల్లడించారు