హైందవ సంసృతి సాంప్రదాయాలను చాటిచెప్పేలా రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలో హిందూ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉరవకొండ గవిమఠం పీఠాధిపతులు కరిబసవ రాజేంద్ర మహాస్వామి, ధర్మ జాగరణ ప్రముఖ్ శ్యాంకుమార్ హాజరయ్యారు. హిందువుగా జీవించు హిందువునని గర్వించు అనే నినాదంతో జరిగిన కార్యక్రమంలో రాయదుర్గం MLA కాలవశ్రీనివాసులు, మాజీ MLA కాపురామచంద్రారెడ్డి. మున్సిపల్ చైర్ పర్సన్ పొరాళ్ల శిల్ప, మాజీ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రతీ హిందుపు దేశాన్ని ప్రేమించాలని పిలుపునిచ్చారు.