అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో పోలీస్ అధికారులు ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు దీనికి సంబంధించిన వివరాలు డిఎస్పి సాయి ప్రశాంత్ తెలిపారు. ప్రజలు ఆన్లైన్ మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్లో రుణాలు తీసుకోవద్దని, బ్యాంకు అకౌంటులకు సంబంధించిన వివరాలు ఓటిపి వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే ఎవరైనా ఆన్లైన్లో రుణాలు తీసుకుని ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆత్మహత్యలు వంటివి చేసుకోవద్దని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే పోలీసుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు.