కర్నూలు: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి: పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత రెడ్డి
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టర్ కార్యాలయం లోని సునయన సమావేశ మందిరంలో 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల నాయకులు పాల్గొని వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. స్త్రీ శక్తి పథకం అమలు అయిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిందని వికలాంగులుకు కేటాయించిన సీట్లలో వికలాంగులే కుర్చునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.