వివాహేతర బంధం వద్దన్నందుకు తన భార్య తనను చంపాలని చూస్తోందని పృథ్వీరాజ్ ఆరోపించాడు. నెల్లూరులోని పోలీస్ కాలనీలో నివాసముంటున్న ఇతడు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ వైజర్‌గా పనిచేస్తాడు. ఇతడికి 2013లో చెన్నైకు చెందిన రంజనీ కుమారితో వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇటీవల ఆమె సయ్యద్ నజీబ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని, తన ఇంటిని సైతం OLXలో అమ్మకానికి పెట్టిందని భర్త ఆరోపించాడు.