జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై జిహెచ్ఎంసి చెత్త లారీలు రాకతో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు డంపింగ్ యార్డ్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. సమస్యపై పటిష్ట చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు అధికారులను కోరుతూ హెచ్చరించారు. స్థానిక ప్రజల పక్షాన సహాయ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.