పులివెందుల: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం ఆదర్శం ,స్ఫూర్తిదాయకం : వేంపల్లి లో రాజ్యసభ మాజీ సభ్యులు తులసి రెడ్డి వెల్లడి
Pulivendla, YSR | Sep 15, 2025 భారతరత్న స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164 వ జయంతిని వేంపల్లి లో సోమవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ అని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని ,మహా మేధావి అని ,మేధస్సులో బృహస్పతి వంటి వాడని కొనియాడారు. తిరుపతి తిరుమల ఘాట్ రోడ్ నిర్మాణంలో, మూసీ నది వరదల నుండి హైదరాబాదును రక్షించడంలో విశ్వేశ్వరయ్య పాత్ర ఉందని తులసి రెడ్డి అన్నారు.