ఇబ్రహీంపట్నం: కథలాపూర్ మండలంలో మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్ట్
కథలాపూర్ మండలంలోని మాల మహానాడు నాయకులను గురువారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి మాల మహానాడు నాయకులు తరలి వెళ్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ఆయా గ్రామాలకు వెళ్లారు. మాల మహానాడు నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచారు. అరెస్టయిన వారిలో మాల మహానాడు నాయకులు ప్రశాంత్, కోట శంకర్, నరేశ్, స్వామి, శ్రీను ఉన్నారు.