మంత్రాలయం: రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద కడబూరు నుంచి ఆదోనికి పాదయాత్ర
పెద్ద కడబూరు:రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద కడబూరు నుంచి ఆదోనికి పాదయాత్రను ప్రారంభించారు. సీపీఎం నాయకులు రాధాకృష్ణ, తిక్కన్న, శ్రీనివాసులు, కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీఎస్ కుడి కాలువ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. పులికనుమ ప్రాజెక్టు ద్వారా పెద్దకడబూరు మండలానికి సాగునీరు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.