రాజంపేట: సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి రాజంపేట మండల వైద్యాధికారి డాక్టర్ విజయ మహాలక్ష్మి
సీజనల్ కాలంలో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కామారెడ్డి జిల్లా రాజంపేట మండల వైద్యాధికారి డా. విజయ మహాలక్ష్మి సూచించారు. నీటి నిల్వ లేకుండా, దోమల ఎదుగుదలను నివారించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో కాచి వడబోసి చల్లార్చిన నీరునే తీసుకోవాలని, వేడి ఆహార పదార్థాలు భుజించాలన్నారు.