ప్రకాశం జిల్లా కొండపీ మండలం మిట్టపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం పై ఉపాధి హామీ కూలీలకు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆంజనేయులు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం మార్చిన చట్టాలతో ప్రస్తుత ఉపాధి హామీ పథకంలో పని చేస్తే కూలీలు తీవ్రంగా నష్టపోతారని పాత ఉపాధి హామీ పథకం చట్టాలే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కంకణాల ఆంజనేయులు కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.