చిట్యాల: నేరడ గ్రామంలో విషాదం, పొలం పనులు చేస్తుండగా మూర్చ వచ్చి రైతు మృతి, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, నేరడ గ్రామంలో విషాద ఘటన జరిగింది. పొలం పనులు చేస్తుండగా మూర్ఛ రావడంతో రైతు పొలంలో పడి మృతి చెందాడు. చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం పొలంలో సాధారణంగా పనిచేస్తుండగా వడ్డేపల్లి సైదులు (40) అనే రైతుకి మూర్చవచ్చి పొలంలో పడిపోయాడు. ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.