హుజూరాబాద్: పట్టణంలో కిడ్స్ వరల్డ్ షాప్ భారీ ఆఫర్ షాపు ముందు బారులుతిరిగిన జనాలు తక్కువ ధరకే కిడ్స్ దుస్తులు రావడంతో ఎగబద్ద జనాలు
హుజూరాబాద్: పట్టణం లో దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు షాపు యాజమాన్యాలు. పట్టణం లో కొత్తగా ప్రారంభమైన కిడ్స్ వరల్డ్ లో పదకొండు సంవత్సరాల లోపు పిల్లలకు 9 రూపాయలకే టీ షర్ట్ అని ప్రచారం చేయడంతో సోమవారం మధ్యాహ్నం షాపు ముందు భారీగా మహిళలు పిల్లలు బారులు తీరారు. చిన్న పిల్లలే కాకుండా గర్ల్స్ టి షర్టులు49, గర్ల్స్ ప్లాజా 59, గర్ల్స్ ఫ్రాక్ లు 69 రూపాయలకే ఇవ్వడం తో జనాలు ఎగబడ్డారు. షాపు హుజూరాబాద్ - జమ్మికుంట రోడ్డు పై ఉండడం తో జనాలకు తీవ్ర అంతరాయం కలిగింది.